calender_icon.png 16 July, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్

15-07-2025 10:26:32 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలో మంగళవారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మహిళా సంఘాల ప్రతినిధులు రూపొందించిన వివిధ రకాల ఆహార పదార్థాలను, వంటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి మాట్లాడుతూ రైసింగ్ తెలంగాణ వందరోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ రకాల కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు తయారుచేసిన వంటకాలను విక్రయించడం ద్వారా మూడు వేల రూపాయలను ఆర్జించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్లు, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.