calender_icon.png 16 July, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటెల్లిజాయింట్‌తో కీళ్ల మార్పిడి

16-07-2025 01:22:05 AM

  1. వైద్యరంగంలో ఇదొక విప్లవం
  2. మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ కృష్ణకిరణ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స రంగంలో విప్లవాత్మక అభివృద్ధిగా నిలిచిన ‘ఇంటెల్లిజాయింట్‘ సూక్ష్మ నావిగేషన్ టూల్‌ను హైదరాబాద్ నోవోటెల్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక హెచ్‌ఐపీ (HIP) మాస్టర్స్ కోర్సు సందర్భంగా లైవ్ సర్జరీల ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్, చీఫ్ ప్రైమరీ, రివిజన్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఈ కృష్ణకిరణ్ అధ్యక్షత వహించారు.

అమెరికా సహా అనేక దేశాల నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ అధ్యాపకులు ఈ కోర్సులో పాల్గొనగా, దేశవ్యాప్తం గా 200 మందికి పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు, ట్రైనీలు పాల్గొన్నారు. లైవ్ సర్జరీలు, ఇంటరాక్టివ్ కేస్ డిస్కషన్లు, మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఈ కోర్సు విద్యా పరంగా అనేక మందికి ప్రయోజనం చేకూర్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. “ఇంటెల్లిజాయింట్ టూల్ ఒక కాంపాక్ట్ మరియు అధిక ఖచ్చితత కలిగిన శస్త్రచికిత్సా నావిగేషన్ వ్యవస్థ.

ఇది హిప్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల సమయంలో సర్జన్లకు రియల్‌టైం ఇంట్రాఆపరేటివ్ గైడెన్సును అందించి, శస్త్రచికిత్స ఖచ్చితతను పెంచి, ఇంప్లాంట్ స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సంక్లిష్టమైన ప్రాథమిక మరియు పునరుద్ధరణ కేసులలో ఇది ఎంతో ఉపయోగప డుతుంది” అని చెప్పారు.

“HIP మాస్టర్స్ కోర్సు ద్వారా యువ సర్జన్లకు శిక్షణ ఇచ్చి, రోగులకు ప్రపంచ స్థాయి చికిత్స అందించాలన్నదే మా లక్ష్యం. ఈ కార్యక్రమం ఆర్థోపెడి క్ విద్యా రంగంలో భారత్ను మరో అడుగు ముందుకు నడిపించే ఘట్టంగా నిలిచింది. శస్త్రచికిత్సా ఉత్తమతకు, ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలపడింది” అని చెప్పారు.