20-06-2024 12:05:00 AM
ఇటీవల విడుదలైన ‘మనమే’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆనందంగా ఉన్న శర్వానంద్ తన తర్వాతి ప్రాజెక్టు ‘శర్వా37’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు శర్వా 37వ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు కాగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా సాక్షి వైద్య నటిస్తున్నది.
సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఈ భామ పేరు ‘నిత్య’ అని, ఓ ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తుందని చిత్రబృందం చెప్పింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్; కథ భాను భోగవరపు; మాటలు: నందు సవిరిగాన; సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్.