20-06-2024 12:05:00 AM
రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీ16’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో, స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“ఆర్‌సీ16’ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీని షూటింగ్ ఆగస్టు లో ప్రారంభించను న్నాం. అని తెలిపారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ఇప్పటికే సినీ పరిశ్రమలో మాట్లాడుకుంటున్న సంగతి విదితమే. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే తాజా చిత్రం ‘ఆర్‌సీ16’ పట్టాలెక్కనున్నది.