calender_icon.png 16 August, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెట్టే కిష్కింధపురి

16-08-2025 12:25:14 AM

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వ రన్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న వి డుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజ ర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ‘సువర్ణమాయ రేడియో స్టేషన్.. ఆకాశవాణి తలుపులు తెరువబడ్డాయి’ అన్న వ్యాఖ్యలు జోడిస్తూ చిత్రబృందం టీజర్‌ను సోషల్‌మీడియాలో పంచుకుంది.

టీజర్ ఆద్యంతం మిస్టీరియస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతోంది. ఒక పురాతన భవనంలోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం కావడం.. ఇంతలో రేడియో నుంచి ఒక మెసేజ్ ప్రసారం కావటం వంటి అంశాలన్నీ క్యురియాసిటీని పెంచాయి. టీజర్‌లో నాయకానాయికలు సాయి శ్రీనివాస్, అనుపమ క్యారెక్టర్లను పరిచయం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్; డీవోపీ: చిన్మయ్ సలాస్కర్; ఆర్ట్: డీ శివ కామేశ్; ఎడిటర్: నిరంజన్ దేవరమానే; స్టంట్స్: రామ్ క్రిషన్, నటరాజ్, జాషువా.