calender_icon.png 25 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాలుగా చీకట్లోనే

25-09-2025 01:01:30 AM

  1. ఓ గిరిజన గ్రామం దుస్థితి 

అవస్థలు పడుతున్న అడవి బిడ్డలు

వెలుగులు నింపాలని గ్రామస్థులవిజ్ఞప్తి

మణుగూరు, సెప్టెంబర్ 24 (విజ యక్రాంతి) : అడవి బిడ్డలను అన్ని విధాలు గా అభివృద్ధి పధం లోకి తీసుకొస్తామని చె బుతున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలవుతున్నాయని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ సం స్థను ఏర్పాటు చేసినా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య  మో, పాలకుల అలసత్వమో కానీ వా రి బతుకులు నేటి కీ మారడం లేదన్నారు.

కరకగూడెం మండలం అంగూరిగూడెం ద శాబ్దాలుగా గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేక అంధ కారంలో మగ్గుతుందన్నారు. స్వా తంత్య్రం వచ్చి 83 ఏళ్లు గడు స్తున్నప్పటికీ నేటికీ గిరిజన గ్రామానికి కరెంటు లేకపోవడందారుణమన్నారు. విద్యుత్ సౌకర్యం లేక పోవడం వల్ల రాత్రి వేళల్లో పాములు, అడవి జంతువులతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందన్నారు. గ్రామానికి వెలుగులు నిం పేందుకు విద్యుత్ స్తం భాలు, పరికరాలను గ్రామానికి చేర్చిన కొం దరు కిందిస్థాయి ఫారెస్ట్ సిబ్బంది కుటీలయత్నంతో వివక్ష చూపుతూ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఐటిడిఏ పివో, సమస్యను పట్టించు కోవాలని విజ్ఞప్తి చేశా రు.

అలాగే జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని, లేని పక్షంలో కలెక్టర్ను నేరుగా కలిసి సమస్యను విన్న విస్తామని, అవసరమైతే ప్రజా ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. గ్రామానికి రోడ్డు కరెంటు, నీళ్ల సౌకర్యం కల్పించే వరకువిశ్రమించబోనని  రవి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.