calender_icon.png 15 September, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో

15-12-2024 02:26:04 AM

ఒకే ఒక్కడు..

స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 

 400 బిలియన్ డాలర్ల సంపదను దాటిన మొదటివ్యక్తిగా మస్క్ నిలిచాడు. ప్రపంచలోనే అత్యంత కుబేరుడిగా చరిత్రకెక్కాడు. స్పేస్‌ఎక్స్‌లోని అంతర్గత వాటా విక్రయంతో మస్క్ సంపద నికర విలువ 447 బిలియన్ డాలర్లకు  చేరింది. ప్రపంచంలో ఇప్పటివరకు   400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన ఒకే ఒక్కడిగా మస్క్ చరిత్ర సృష్టించారు. యువకుడిగా ఉన్నప్పడు మస్క్‌కు కేవలం ఒకే ఒక సూట్ ఉండేదని ఆయన తల్లి చెప్పారు. 

చదరంగంలో కొత్త రారాజు

64 గడుల చదరంగంలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు కొత్త రారాజుగా అవతరించాడు. ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్ జగజ్జేతగా నిలిచాడు. 2012లో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ చాంపియన్‌గా నిలవగా.. మళ్లీ పుష్కర కాలానికి టైటిల్‌ను ఒడిసిపట్టి 18 ఏళ్లకే ప్రపంచ చాంపియ న్‌గా నిలిచి అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డులకెక్కాడు.