calender_icon.png 11 November, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి

11-11-2025 10:21:03 PM

టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు..

నారాయణపేట (విజయక్రాంతి): ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో నారాయణపేట టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, నిర్లక్ష్యంగా వదిలిన సంచులు, వాహనాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తక్షణమే పోలీసు స్టేషన్‌కి లేదా డయల్ 100 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతోనే సమాజ భద్రత సాధ్యమని ఆయన తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి అందరూ జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎప్ఐ గాయత్రి, టౌన్ పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.