calender_icon.png 13 January, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం మిన్న.. అభివృద్ధి సున్నా!

13-01-2026 03:04:01 AM

అయిజ బస్టాండ్ దుస్థితి

అయిజ, జనవరి 12 : జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజ మునిసిపాలిటీ జిల్లాలోనే రెండవ పెద్ద మున్సిపాలిటీ. మూడు రాష్ట్రాలకు(కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ) కేంద్ర బిందువుగా ఉన్నదని,  100 గ్రామాలకు పైగా వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్నది పేరున్నది. రోజుకు వందల బస్సులు పైగానే తిరుగుతున్నా, లక్షల పైగానే ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని ప్రజలు అనుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బస్టాండ్ ప్రాగణమంతా చెరువును తలపిస్తుందని, వర్షం వచ్చిందంటే ప్రయాణికులు నిలబడడానికి కూడా స్థలం ఉండదని ప్రజలనుకుంటున్నారు. ఎప్పుడో సుమారు 35 ఏళ్ల క్రితం అప్పటి జనాభాను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాంగణం.

ఇప్పుడు చాలడం లేదని జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రయాణం సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. బస్సులకు ప్లాట్ఫారం లేక ఎగుడు దిగుడు ప్లాట్ఫారంతో బస్సులో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, ఇంత ఆదాయం వస్తున్న బస్టాండ్ గురించి పట్టించుకునే నాథుడు లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మూడు రాష్ట్రాలకు మధ్య కేంద్రంగా ఉన్న అయిజ బస్టాండ్ దుస్థితి ఇది. దీనికి తోడు బస్సులే ఇబ్బంది పడుతుoటే బస్సు ప్రాంగణం ముఖద్వారాం దగ్గర ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, జీపుల జోరు అడ్డగోలుగా నిలపడం వల్ల బస్సు రాకపోకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని,ఎన్నో ప్రమాదాలు కూడా సంభవించాయని అనుకుంటున్నారు.

ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరించడం శోచనీయంగా ఉందని అనుకుంటున్నారు.  ఆదాయం ఉన్నా పల్లెలకు గానీ పట్టణాలకు గాని ఆరకొర బస్సులతోనే నెట్టుకొస్తున్నదని, బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయాణికులు అనుకుంటున్నారు. బస్సు వచ్చిందంటే చాలు సీట్ల కోసం ముందు వెనుక చూసుకోకుండా కుస్తీ కోసం పోటీ పడుతున్నట్టుగా ఎగబడుతున్నారు.

దీనికి కారణం అరకొర బస్సుల సౌకర్యమేనని, ఆదాయంను బట్టి బస్సులు సౌకర్యాలు పెంచితే బాగుంటుందని, ఆదాయం కూడా పెరుగుతుందని ప్రయాణికులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .ఎంతో మంది నాయకులు, పాలకులు తమ రాజకీయ స్వలాభాల కొరకు అయిజను వాడుకున్నారు కానీ  బస్టాండ్ గూర్చి ఆలోచించక పోవడం శోచనీయమని అయిజ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి చెందుతున్న అయిజకు నూతన బస్సు ప్రాంగణం నిర్మిస్తే అయిజ అభివృద్ధి చెందుతుందని ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని పట్టణ వాసులు అనుకుంటున్నారు.

అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నాము

అయిజ దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్ అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది పాలకులు మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అనే విదంగా ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వమైనా నూతన భవనానికి మంజూరి చేస్తే భాగుంటుందని అన్నారు.

- రాజరత్నం, అయిజ మున్సిపాలిటీ