calender_icon.png 13 January, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాహార్తికి చెక్

13-01-2026 03:00:53 AM

  1. బుద్ధారంలో దాహం దాహం 
  2. దాతల సహకారం ప్రజలకు దాహార్తి 
  3. 3 లక్షలతో మోటార్లు 
  4. దాతలకు అభినందనలు.. సర్పంచ్

గోపాలపేట, జనవరి 12: ఆ గ్రామంలో తాగునీటి సమస్య తాండవిస్తుంది ప్రజలు దాహర్తికై వ్యవసాయ బోరుబావులను ఆశ్రయిస్తున్నారు. ఓ దాత సహకారంతో ప్రజల దాహార్తిని రూపుమాపారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటింటి నల్ల ఏర్పాటు చేశారే కానీ సమయం మాత్రం కొద్దిపాటు ఉండడంతో ప్రజలకు సరైన నీరు అందడం లేదు. ప్రజలు కావలసిన నీరు కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తుండడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ ఆలోచనలో పడ్డాడు. ఎలాగైతే నేమి ప్రజలకు తాగునీరు అందించాలన్న సంకల్పం ఎక్కువగా ఉంది.

గ్రామపంచాయతీలో నిధులేమో డొల్ల. ప్రజలు దాహార్తికి ఇబ్బందులు పడుతున్నారని ముందే గ్రామంలో సంక్రాంతి పండుగ వాతావరణం నిండుగా ఉంది పట్నాల నుంచి ప్రజలు దండిగా వచ్చారు. సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ దాతలను ఆశ్రయించారు. దీంతో ఆ గ్రామానికి చెందిన మునగాల కృష్ణారావు బుద్ధారం గ్రామపంచాయతీకి నేను సహకరిస్తానని ముందుకు వచ్చారు. తన మనుమరాలు పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి తాగునీటి సమస్య తీర్చాలని మూడు లక్షలు సహాయం చేశారు.

ఆ మూడు లక్షలతో మోటర్లు తెప్పించి పైప్ లైన్ల ద్వారా గ్రామానికి నీరు అందించారు. దీంతో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య తీరింది. గ్రామానికి సహకరించిన మునగాల కృష్ణారావు దంపతులను సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ గ్రామ ప్రజలు అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు వస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ తెలిపారు.