calender_icon.png 13 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలకు చెక్ జీ రామ్ జీ చట్టం

13-01-2026 01:21:38 AM

దళారుల దోపిడీకి చెల్లుచీటీ

  1. ఇది కేవలం గుంతలు తవ్వే పథకం కాదు 
  2. జియోట్యాగింగ్‌తో పర్యవేక్షణ, పారదర్శకత ఉంటుంది 
  3. బంగ్లా, పాక్‌కు వెళ్లి  ఒవైసీ హిందూ మహిళను ప్రధాని చేయాలనే దమ్ముందా?
  4.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): గత మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (నరేగా) పథకంలోని అక్రమాలకు చెక్‌పెట్టేందుకే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గతం లో గ్రామీణ ప్రాంతాల్లో దళారులు, రాజకీయ నాయకులు, మధ్యవర్తులు ఈ పథకం పేరుతో భారీగా దోపిడీ చేసేవారని, నకిలీ జాబ్ కార్డులు తయారుచేసి డబ్బులు వారి జేబుల్లోకి వెళ్లేవన్నారు. ఇప్పుడు అలాకాకుండా జియో-ట్యాగింగ్ విధానం ద్వారా ఎక్కడెక్కడ పనులు జరిగాయో ఆ పనులపై కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున పర్యవేక్షణ చేస్తుందని, పారదర్శకంగా ఈ పథకాన్ని అమలుచేస్తామని పేర్కొన్నారు.

ఈ పథకం కేవలం తవ్విన గుంతలు మళ్లీ తవ్వే పథకం కాదని, ఇది గ్రామాలను అభివృద్ధి చేసే పథకం, దేశాన్ని అభివృద్ధి చేసే పథకం.. ప్రతి గ్రామీణ కుటుంబానికి అదనపు ఆదాయం కల్పించే పథకమని స్పష్టంచేశారు. రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయని, కానీ రాష్ట్రాలపై మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు భారం మోస్తోందన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడారు. కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వీబీ జీ రామ్‌జీ యాక్ట్- 2025పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

అనేక సంస్కరణలు, అనేక మార్పులతో దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి మరింత మేలుచేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ పథకంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా వచ్చిన అనుభవాలు, ఫలితాలను సూక్ష్మంగా పరిశీలించి, ప్రజలకు, దేశానికి మరింత ఉపయోగపడేలా అవసరమైన మార్పులు తీసుకొచ్చారన్నారు.

జీఎస్టీ పన్ను విధానం కూడా అందులో ఒక ముఖ్యమైన సంస్కరణ అని, పన్ను వ్యవస్థలో, బడ్జెట్ విధానంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఈ నిరంతర సంస్కరణల ప్రక్రియ లో భాగంగానే వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) - వీబీ జీ రామ్ జీ  యాక్ట్-2025ను గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టామన్నారు.

పథంక అమలులో రాష్ట్రాలదే అధికారం..

ఈ పథకంలో పని అడిగిన ప్రతి కూలీకి తప్పనిసరిగా పని కల్పించాల్సిందేనని, ఏ కారణంతోనైనా పని కల్పించలేకపోతే, వారికి పరిహారం చెల్లించాల్సిందే అనే నిబంధనను చట్టంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రతి రాష్ర్టం తన అవసరాలకు అనుగుణంగా, ఆ రాష్ర్టంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకాన్ని ఏ సమయాల్లో అమలు చేయాలనే నిర్ణయాన్ని రాష్ర్ట ప్రభుత్వాలకే అధికారంగా ఇచ్చామని తెలిపారు. ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వడానికి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన నిధులను 9 శాతానికి పెంచామని, ఇది చట్టబద్ధమైన పథకమని,  ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ ఇస్తున్న గ్యారెంటీ పథకమన్నారు.

రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని అంటున్నారని, కానీ రాష్ట్రాలపై మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు భా రం మోస్తోందన్నారు. ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా రూ. 17 వేల కోట్లు అదనంగా ఈ పథకంపై కేంద్ర ప్ర భుత్వం ఖర్చు చేయబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా గత ఏడాదితో పోలి స్తే సుమారు రూ. 340 కోట్లు అదనం గా కేంద్ర ప్రభుత్వం నిధులు అందించబోతోందని తెలిపారు. వ్యవసాయ పనుల సీజన్ ఎ ప్పుడు ఉంది.. ఆ సమయంలో ఈ పథకాన్ని అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం కేం ద్ర ప్రభుత్వం కాదు - రాష్ర్ట ప్రభుత్వాలే తీ సుకుంటాయని ఆయన వెల్లడించారు.

పనికావాలని నమోదు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లో పని కల్పించకపోతే, వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా కూడా చట్టంలో పొందుపరిచామన్నారు. వేతనాలు ఆలస్యమైతే రోజుకు 5 శాతం పరిహారం చెల్లించే నిబంధనను కూడా తీసుకొచ్చామన్నారు. దళారుల దోపిడీని అరికట్టేందుకు డిజిటల్ లావాదేవీల ద్వారా కూలీల అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా డబ్బులు చేరేలా చట్టం తీసుకువచ్చామని ఆయన పే ర్కొన్నారు. గతంలో తెలంగాణలో కూలీలకు వేతనాలు రెండు-మూడు నెలలు ఆలస్యంగా వచ్చేవి..

దాంతో వారు అధికారుల చుట్టూ, దలారీల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితి ఇకపై ఉండకుండా ఈ చట్టంలో అవసరమైన మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. పథకాల పేర్లకన్నా అమ లే ముఖ్యమని, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనను తామే ప్రారంభించామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని పేరు మార్చిందని, పేరు మార్చడం పెద్ద సమస్య కాదని, ఆ పథకం సఫలంగా అమలవుతుందా? పేదలకు నిజంగా న్యాయం జరుగుతుందా? అన్నదే అసలు కీలక అంశమన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టామని,- తర్వాత మార్చారని గుర్తు చేశారు. 

బంగ్లా, పాక్‌కు వెళ్లి ఓవైసీ చెప్పాలి.. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి హిందూ మహిళా ప్రధాని కావాలని డిమాండ్ చేసే దమ్ము ఉందా అని ఎంఐఎంకు ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో హిందువులు లేకుండా చేశారని, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో హిందువులు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదని, ముస్లీం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత అనడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. దేశ ప్రజలను భయపెట్టే చర్యగా ఎంఐఎం వ్యాఖ్యలున్నాయని, అవగాహన లేకుండా వ్యవహరించడం ఒవైసీకి అలవాటన్నారు.

ఎంఐఎం సూచనలు మాకు అవసరం లేదని ఆయన ఘాటుగా స్పందించారు. -----ఈ మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డా ఎన్ గౌతమ్‌రావు, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు డా ఎస్ ప్రకాష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వకుళాభరణం తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మోదీయే ప్రధాని.. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, మళ్లీ రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని బీఆర్‌ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. దేశంలో స్థిరమైన నాయకత్వం బీజేపీదేనని, దేశవ్యాప్తంగా బీజేపీ వరుసగా నాలుగు, ఐదు సార్లు గెలుస్తోందని, ప్రధానమం త్రి నరేంద్ర మోదీ ఇప్పటికే మూడోసారి ప్రధాని అయ్యారని, రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనే దేశ ప్రధానమంత్రి అవుతారని, ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్రమం త్రి నిర్మలా సీతారామన్‌ని అడగడం లో తప్పేమీ లేదని,  మేము కూడా అడుగుతామన్నారు. పోలవరానికి జా తీయ హోదా ఇవ్వడం రాష్ర్ట విభజన చట్టం ఆధారంగా జరిగిందని చెప్పారు.