calender_icon.png 13 January, 2026 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే మున్సిపాలిటీని త్యాగం చేస్తాం..

13-01-2026 02:57:28 AM

జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి

 కల్వకుర్తి టౌన్, జనవరి 12 : కల్వకుర్తిని నూతన జిల్లాగా ప్రకటిస్తే అందుకు ప్రతిఫలంగా వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని సీఎం రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని బిజెపి నేత బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. పూర్వపు కల్వకుర్తి సమితి, ఆమనగల్లు సమితి, వెల్దండ, మాడుగుల, కడ్తాల్, తలకొండపల్లి, కేశంపేట, మిడ్జిల్, ఊరుకొండపేట, వంగూరు, చారకొండ, డిండి, కొత్తగా ఇర్విన్, గట్టిప్పల్లపల్లి, రఘుపతిపేట, వెల్జాల, ముద్విన్, మండలాలను ఏర్పాటు చేసి, అచ్చంపేట నియోజక వర్గాన్ని కలుపుతూ కల్వకుర్తి నూతన జిల్లాగా  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

కల్వకుర్తి ప్రాంత ప్రజల చిరకాల కోరిక కల్వకుర్తి జిల్లాను దివంగత ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్‌రెడ్డి పుట్టపాగ మహేంద్రనాథ్ పేర్లతో ఏర్పాటు చేయాలని, జిల్లాగా ఏర్పడితే కల్వకుర్తికి మెడికల్ కళాశాల వస్తుందని ఆ కళాశాలకు దివంగత మాజీ ఎమ్మెల్యే యాడ్మ కిష్టారెడ్డి పేరు పెట్టాలని, రేవంత్ రెడ్డి రాజకీయ గురువు గోపాల్ రెడ్డి పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 16న దివంగత సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా కల్వకుర్తి జిల్లాను ప్రకటించి ఈ ప్రాంత ప్రజలకు  బహుమతిగా అందించాలని కోరారు.

దానికి రిటర్న్ గిఫ్ట్‌గా బిజెపి తరఫున కల్వకుర్తి ఆమనగల్లు మున్సిపాలిటీల నుండి రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్లలో పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటామని, రెండు మున్సిపాలిటీలలో మీపార్టీ జెండా ఎగిరేసుకోవాలని బిజెపికి రాజకీయం కంటే ఈప్రాంత అభివృద్ధి ముఖ్యమని సంచలన నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకు ముందు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆచారి నివాళులు అర్పించారు. 

బిజెపి నాయకులు, అసెంబ్లీ కన్వీనర్ యేన్నం శేఖర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్, సీనియర్ నాయ కులు సూర్యకృష్ణ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, పాలకూర్ల రవి గౌడ్, బాలస్వామి, పెద్దారి విజయ్, అభిలాష్ రెడ్డి, వాగుల్ దాస్ నరేష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, అభి గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ, కార్యదర్శి వెంకటేష్ యాదవ్, కోశాధికారి లక్ష్మీనరసింహ, కాళిదాస్ చారి,పుట్ట చంద్రశేఖర్, దామర్ల శేఖర్, డేరంగుల శివ, దేవర్ల మహేష్, తోడేటి అరవింద్ రెడ్డి, మాకం శ్రీనివాసులు పాల్గొన్నారు.