calender_icon.png 13 January, 2026 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీవీ, ప్రైమ్-9లపై క్రిమినల్ కేసులు

13-01-2026 01:55:11 AM

తెలుగు స్క్రుబ్, మిర్రర్ టీవీ, సిగ్నల్ టీవీలపైనా కేసులు

పోలీసులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టిం చిన ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించిన వ్యవహారంలో నిరాధారమైన వార్తలు ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవ న్నీ పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం బురదజల్లేందుకే ఈ దుష్ర్పచారం చేస్తున్నారని అసోసియేషన్ తరఫున రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎన్టీవీ, ప్రైమ్-9 న్యూస్ చానళ్లతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు స్క్రుబ్, మిర్రర్ టీవీ, సిగ్నల్ టీవీ తదితర హ్యాండిల్స్‌పై కేసులు నమోదు చేశారు.

నిరాధారమైన ఆరోపణలతో మహిళా అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, మంత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందు కు గాను ఐపీసీ, బీఎన్‌ఎస్ చట్టాల ప్రకారం కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు సమాచారం. మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించేది లేదని ప్రభుత్వ వర్గా లు, ఐఏఎస్ అసోసియేషన్ ఈ సందర్భంగా హెచ్చరించాయి.