08-10-2025 01:25:06 AM
బీఆర్ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు
ముషీరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో పెం చిన ఆర్టీసి బస్ టికెట్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు డిమాండ్ చేశా రు. ఈ మేరకు మంగళవారం భోలక్ పూర్ డివిజన్లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి స్టేజీకి 5 రూపాయలు పెంచడం దారుణం అన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలపై పెంచిన టికెట్ చార్జీల వల్ల అధిక భారం పడనున్నదని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ ఎస్ భోలక్ పూర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్, డివిజన్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ప్రవీణ్, సోషల్ మీడియా ఇన్చార్జి ప్రవీణ్ కుమార్, మగ్బూ ల్ తదితరులు పాల్గొన్నారు.