11-10-2025 12:18:53 AM
ఈనెల 13న కలెక్టరేట్ ఎదుట నల్ల జెండాలతో ఎమ్మార్పీఎస్ నిరసనలు
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
ఎల్లారెడ్డి అక్టోబర్ 10 (విజయక్రాంతి) : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి,న్యాయ వ్యవస్థ పై భారతరాజ్యాంగం, ప్రజాస్వామ్యం, యావత్తు దళిత సమాజం పై జరిగిన తీవ్రమైన దాడి గా తెలియ చేస్తున్నాంసంఘటనపై లో వ్యక్తి మాత్రమే కాకుండా దీని వెనుక ఉన్న శక్తులనువెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉన్నదని గుర్తు చేస్తున్నాం సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాలు ప్రజాస్వామిక వాదులతో పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, మండల అధ్యక్షులు రామగల్ల శివానందం మాదిగ,సట్టిగారి లక్ష్మీ మాదిగ, నాయకులు కొత్తూరు సాయిలు మాదిగ, గాంధారి గంగారాం,తొంట సాయిలు, సాయి వరుణ్, సామేలు పాల్గొన్నారు.
జస్టిస్ గవాయిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఏర్గట్ల, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : జస్టిస్ గవాయిపై బూటు విసిరి దాడికి పాల్పడ్డ అడ్వకేట్ ను కఠినంగా శిక్షించాలని ఏర్గట్ల మండల దళిత బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం దళిత బహుజన సంఘాల నాయకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ గవాయి పై దాడికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతూ తహసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు రాజేష్ రక్షక్,గన్నారపు రాజేశ్వర్, దిబ్బ సుదర్శన్ శోభన్, జుంగల గణేష్,బోడా గణేష్,శేఖర్, అనిల్,యుగేందర్,సురేష్, భూమన్న,రాజన్న పాల్గొన్నారు.