calender_icon.png 12 January, 2026 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరల దడ.. ఎడాపెడా!

12-01-2026 12:25:48 AM

ఇంటా, బయటా కుంపట్లు

కాగుతున్న నూనెలు, కొండెక్కిన కూరగాయలు 

చికెన్ ధరలకు రెక్కలు  

ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు

మణుగూరు, జనవరి11 (విజయక్రాంతి) : పెరిగిన నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సంక్రాంతి పండుగను జరు పుకునే పరిస్థితిలో లేకుండా పోతున్నది. ముఖ్యంగా నూతన సంవత్సరం ఆరం భం లోనే ధరల దడ, ఏడపెడాగా పెరుగు తుండటంతో  సామాన్యులు కొనలేని పరి స్థితి నెలకొంది. ధరలను నియంత్రించడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వి ఫలమైందని పలు ప్రజా సంఘాలు నాయ కులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెరిగి న దరాఘాతంపై విజయక్రాంతి కథనం..  

ధరల దడ, ఏడపెడా..

సంక్రాంతి పండుగ అంటే పట్టణాల్లో నివ సించే వారు కూడా సొంత గ్రామాలకు వచ్చి అక్కడ నాలుగు రోజులు పాటు బం ధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనం  దంగా పండుగలు జరుపుకుంటారు. దూర ప్రాంతాల నుండి ఉద్యోగ నిమిత్తమై వెళ్లి న వారు కూడా గ్రామాలకు వస్తుంటారు.  సంక్రాంతి పండుగను  ఘనంగా జరుపుకో వాలని భావిస్తారు. ఈ పండుగలను దృష్టి లో  పెట్టుకొని వ్యాపారస్తులు అమాంతం గా కృత్రిమ  కొరతను సృష్టించి, నిత్యావ సరాల ధరలను ఒక్కసారిగా పెంచేసి సా మాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నారు. 

ఇంటా, బయటా కుంపట్లు..

గ్యాస్ ధర, వంట నూనెలు కూడా అమాం తంగా పెరిగి పోయాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఇళ్లల్లో వంటలతో ప్రారంభ మ వుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిండి వంటలు చేసుకుని ఇంటిళ్లిపాది ఆనందం గా నిర్వహించుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అలాంటి పిండి వంటలు చేసుకునేలా ఈ పండగ కన్పించడం లే దు. అమాంతంగా ధరలు పెరగడంతో ప్రజలు పిండి వంటలు చేసుకుని పరిస్థితి చేరింది. ప్రత్యేక దుకాణాల్లో విక్రయిస్తున్న పదార్థాలను కొనుక్కొని వచ్చి పండగ జరుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పూ లు, పండు, స్వీట్లు, బట్టలు ధరలు కూడా ఒక్కసారిగా ధరలు పెంచేసి సామాన్యు లకు అందుబాటులో లేకుండా చేస్తున్నా రు.ఇది ఇలా ఉంటే పండుగ కోసం సూదు ర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను ప్రయివేట్ వాహనాల యాజమాన్యం  ఎ క్కువ రేట్లు పెంచి దోచుకోవడం పరిపాటిగా మారింది.

మాంసం ధర కొండెక్కింది... 

కోడి మాంసం ధర ట్రిపుల్ సెంచరీ కొట్టిం ది. మూడు నెలలుగా రూ.260 వద్ద కొన సాగుతున్న ధర రెండు వారాల వ్యవధిలో నే రూ.300కి చేరింది. ఇప్పటికే గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తుండగా పెరిగిన మాం సం ధరతో కళ్లు తిరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తు తం బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300కు చేరింది. లైవ్ కోడి రూ.170కు పెరిగింది. ఫారం కోడి మాంసం కేజీ రూ.180,గా ఉంది. కోడి గుడ్ల ధరలు అమాంతం పెరి గాయి. వారం, పదిరోజులుగా గుడ్డు హోల్ సేల్ ధర రూ. 7 ఉండగా, రిటైల్లో మా త్రం రూ. 8కి అమ్ముతున్నారు. కోళ్లు, కోడి గుడ్ల అమ్మకాల్లో హోల్ సేల్కు, రిటైల్కు వ్యత్యాసం ఉండడంతో ఎప్పుడు ధరలు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెల కొంది. ఈ నెలలోనే మేడారం మహా జాత రతోపాటు పలుచోట్ల మినీ జాతరలు ఉం డటంతో కోళ్ల ధరలు మరింత పెరిగే అవ కాశం ఉందంటున్నారు.  

ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు

మరోవైపు వంటనూనెలు సలసలా కాగు తుండగా,మిర్చి ఘాటెక్కిస్తుంది. ధరా భారం చూసి పేదలు, సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. దీనికితోడు సందట్లో సడే మియాలాగా కల్తీ మాఫియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. వేరుశనగ, పొద్దు తిరుగుడు నూనెల పేరుతో విక్రయాలు జరుపుతున్నది. ప్రస్తుతం రూ.195కు చే రుకున్నది. పామాయిల్ రూ.130 నుంచి రూ.185కు, రైస్రిచ్ రూ.150 నుంచి రూ. 180కు, పల్లీనూనె రూ.163 నుంచి రూ. 200కు చేరుకున్నది. ధరలు మరింత పెరు గుతాయనే ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్ప టికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ధరలు నియం త్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నా రు.