29-06-2024 12:51:24 PM
బ్రిడ్జ్ టౌన్: నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్ లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. భారత్- దక్షిణాఫ్రికా అజేయంగా ఫైనల్ చేరాయి. టీ 20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2007 ఫైనల్ లో పాకిస్థాన్ పై గెలిచి, 2014 ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2వ సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఏ ఫార్మాట్ లోనైనా ప్రపంచకప్ ఫైనల్ చేరడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి. ఇప్పటిదాకా 25 టీ 20ల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడింది. టీ 20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్ కు 14 విజయాలు, 11 ఓటములు ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాతో 6 సార్లు తలపడిన టీమిండియా 4 మ్యాచుల్లో నెగ్గి రెండింటిలో ఓడింది. ఈ టీ 20 ఫైనల్ మ్యాచులో భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.