29-06-2024 12:26:01 PM
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ 20 ఫైనల్ మ్యాచ్
నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్ ఫలితం తేల్చనుంది. ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు కొనసాగనున్నాయి. వర్షం కారణంగా సూపర్ ఓవర్ సాధ్యం కాకుంటే సంయుక్త విజేతలుగా ఇరు జట్లు ప్రకటిస్తారు. ఇవాళ్టి బారత్- దక్షిణాఫ్రికా ఫైనల్ కు ఖచ్చితంగా వర్షం ముప్పు ఉంది. కనీసం 10 ఓవర్లు సాధ్యం కాకపోతే రిజర్వ్ డేకు మ్యాచ్, ఇవాళ మ్యాచ్ అగితే.. అక్కడి నుంచే రేపు కొనసాగనుంది. రిజర్వ్ డేలో మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించనున్నారు.
ఈ టోర్నీలో బ్రిడ్జ్ టౌన్ వేదికగా అఫ్గానిస్తాన్ పై టీమిండియా నెగ్గింది. బ్రిడ్జ్ టౌన్ వేదికపై ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బ్రిడ్జ్ టౌన్ పిచ్ బ్యాంటింగ్ కు, బౌలింగ్ కు సమానంగా సహకరించనుంది. ఈ సారి ప్రపంచకప్ లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఆరు మ్యాచులు జరిగాయి. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 3 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. మరో 3 మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. బ్రిడ్జ్ టౌన్ వేదికగా మొత్తం 32 మ్యాచులు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. 11 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి.