15-08-2025 11:42:03 PM
త్యాగదనుల స్ఫూర్తిని వృధా కానివ్వం
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని అందువల్లే ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్ర్యం, సమానత్వం హక్కులు పొందుతున్నారని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయ స్థలంలో పాత మార్కెట్ యార్డ్ సమీపంలో జాతీయ జెండాలను ఎంపీ మల్లు రవితో పాటు ఆవిష్కరించారు.
ప్రతి ఒక్కరూ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తోందని గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ సర్కారు కృషి చేస్తుందన్నారు. యువత అసాంఘిక కార్యక్రమాల వైపు దిష్టి సారించకుండా సమాజ సేవ కోసం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.