calender_icon.png 16 August, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేద పాఠశాలలో స్వతంత్ర దినోత్సవం

16-08-2025 12:00:00 AM

కొండపాక, ఆగస్టు 15: కొండపాక వేద ఇంటర్నేషనల్ పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మార్చి ఫస్ట్, దేశభక్తి గేయాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాస పోటీలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఫ్యాన్సీ టెస్ట్ కాంపిటీషన్ నిర్వహించి, ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో భారత జవాన్ల వేషధారణలతో కవాతు నిర్వహించారు.

ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు గోపికమ్మ శ్రీకృష్ణ వేషాధారణల ప్రదర్శనలతో చూపర్లను ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పిల్లట్టు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తితో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం పాఠశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ షేక్ షాహిన్, శబాబి ఉపాధ్యాయిని ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు.