26-11-2025 12:00:00 AM
-క్లీన్‌స్వీప్ పరాభవం తప్పేనా ?
-రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ తడబాటు
-టార్గెట్ 549.. ప్రస్తుతం 27/2
గుహావటి, నవంబ్ 25 : రెండో టెస్టులో నాలుగోరోజు కూడా సౌతాఫ్రికాదే ఆధిపత్యంగా నిలిచింది. వికెట్ నష్టపోకుండా 27 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ ఓపెనర్లు మరోసారి మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడడంతో టీ బ్రేక్ సమయానికి 107/3 తో నిలిచింది. అయితే రెండో సెషన్‌లో భారత బౌలర్లు విఫలమవ్వడంతో సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. స్టబ్స్, డీ జోర్జ్ అటాకింగ్ బ్యాటింగ్‌తో స్కోర్ పెంచారు. దీంతో ఆ సెషన్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 220/4 స్కోర్‌తో ఉన్న సౌతాఫ్రికాను భారత బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు.
పిచ్ కాస్త స్పిన్‌కు అనుకూలించినప్పటకీ డీ జోర్జ్, స్టబ్స్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. డీ జోర్జ్ 49 రన్స్‌కు ఔటైన తర్వాత స్టబ్స్ దూకుడు పెంచాడు. ముల్దర్ కూడా బౌండరీలు బాదడంతో చూస్తుండగానే ఆధిక్యం 530 దాటిం ది. లంచ్ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని భావించినా మూడో సెషన్‌లో కూడా బ్యా టింగ్ చేసేందుకే నిర్ణయించుకుంది.
స్టబ్స్ (94) సెంచరీ ముంగిట ఔటైన వెంటనే రెం డో ఇన్నింగ్స్‌ను 260/5 దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఇక్కడ నుంచి సౌతాఫ్రికా వ్యూహం మరింత బాగా పనిచేసిందనే చె ప్పాలి. భారత ఓపెనర్లను ఔట్ చేయాలనే లక్ష్యం నెరవేర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన జైస్వా ల్ 13 (1 ఫోర్, 1 సిక్సర్) రన్స్‌కు ఔటవడంతో 17 పరుగుల దగ్గరే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే కేఎల్ రా హుల్(6)ను హార్మర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఈ దశలో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ పట్టుదలగా ఆడుతూ మరో వికెట్ పడకుం డా రోజును ముగించారు. నాలుగో రోజు ఆటముగిసే సమయా నికి భారత్ 2 వికెట్లకు 27 రన్స్ చేసింది. విజ యం కోసం భారత్ 522 పరుగులు చే యాల్సి ఉండగా.. చేతిలో 8 వికెట్లున్నాయి. భారత బ్యాటర్ల వైఫ ల్యాల బాటను చూస్తే చివరిరోజు క్రీజులో నిలిచి డ్రా చేసుకో వడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా సిరీస్ 1 సౌతాఫ్రికా సొంతమవుతుంది. అ ప్పుడు సొంతగడ్డపై మరో క్లీన్‌స్వీప్ పరాభవం తప్పిన ట్టవు తుం ది. ఇప్పటికే తీవ్ర వి మర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా బ్యాటర్లు చివరి రోజు సఫారీ బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తారో లేదా తలవంచుతా రో చూడాలి.
ఈడెన్ టెస్టులో ఓడినప్పుడు పిచ్ కారణంగానే అనుకున్నారు.. తీరా అసలు సిసలు బ్యాటింగ్ పిచ్‌ను సిద్ధం చేస్తే కనీసం ప్రత్యర్థి చేసిన స్కోరులో సగం కూడా చేయలేదు. ఈ పిచ్ హైవే రోడ్‌లా ఉందంటూ కుల్దీప్ స్వయంగా చెప్పిన తర్వాత, ఇదే పిచ్‌పై సౌతాఫ్రికా జట్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ 700కు పైగా పరుగులు చేస్తే.. భారత్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే పరిమితమైంది. ఇప్పుడు అసాధ్యమైన 549 పరుగుల భారీ లక్ష్యఛేదనలో నాలుగోరోజే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. సిరీస్ ఓటమి ఖాయమైపోగా.. ఇప్పుడు డ్రా చేసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో మరో క్లీన్‌స్వీప్ పరాభవం ముంగిట నిలిచిన భారత్ 25 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాకు సిరీస్ సమర్పించుకోబోతోంది.
స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489 ఆలౌట్ ( ముత్తుసామి 109, జెన్సన్ 93 , స్టబ్స్ 49, వెరెన్నే 45, బవుమా 41 ; కుల్దీప్ యాదవ్ 4/115, బుమ్రా 2/75, జడేజా 2/94, సిరాజ్ 2/106 )
భారత్ తొలి ఇన్నింగ్స్: 201 ఆలౌట్ ( జైస్వాల్ 58, వాషింగ్టన్ సుందర్ 48, రాహుల్ 22; జెన్సన్ 6/48, హార్మర్ 3/64)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్ ( స్టబ్స్ 94, డీ జోర్జి 49, రికెల్టన్ 35 ; జడేజా 4/62)
భారత్ రెండో ఇన్నింగ్స్: 27/2 ( జైస్వాల్ 13, రాహుల్ 6 , సాయిసుదర్శన్ 2 బ్యాటింగ్, కుల్దీప్ 4