27-11-2025 12:00:00 AM
ఇఫో, నవంబర్ 26 : అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. తొలి మ్యాచ్‌లో కొరియాను మట్టికరిపించిన భారత్ రెండో మ్యాచ్‌లో బెల్జి యంపై పరాజయం పాలైంది. అయితే మూ డో మ్యాచ్‌లో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య మలేషియాను ఓడించింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ 4 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున సెల్వమ్ కార్తి(7వ నిమిషం) , సుఖజీత్ సింగ్(21వ నిమిషం), రోహిదాస్ అమిత్(39వ నిమిషం), కెప్టెన్ సంజయ్(53వ నిమిషం) గోల్స్ చేశారు.