10-10-2025 12:29:53 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారత్‌లో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్ ఉగ్ర సంస్థ జైషే మ హ్మద్ కొత్త వ్యూహాలకు తెర లేపుతున్న ది. మహిళా ఉగ్రవాదులతో కలిసి భారత్‌లో అలజడులను సృష్టించాలని పాక్ ఉగ్రసంస్థ ప్రయత్నాలు ఆరంభించించింది. ఇందుకోసం మహిళలతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి వారితో ఉగ్ర దాడులను చేయాలని చూస్తోంది. ఇందుకోసం పాక్ ఉగ్ర సంస్థ జైషే ఏ మహ్మద్ తాజాగా మహిళలను చేర్చుకునేందుకు పాక్‌తో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్లకు యత్నిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు ఛిన్నాభిన్నమైన జైషే-ఏ-మహ్మద్ ఉగ్రకార్యకలాపాల్లో తొలిసారిగా మహిళలను రంగంలోకి దిం పేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు యువకులనే లక్ష్యంగా చేసుకున్న ఈ సంస్థ తాజాగా విద్యావంతులైన ముస్లిం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోం దని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. లష్కర్ ఏ తయ్యబాతో పాటు జైష్ మహిళలను యుద్ధ కార్యకలాపాలకు దూ రంగా ఉంచుతాయి.
కానీ జైషే తాజాగా తన పంథాను మార్చుకుని మహిళలనూ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మతపరమైన ప్రసంగాలు, భావోద్వేగపూరిత సందేశాలతో వారిని బ్రెయిన్వాష్ చేసి తమ నెట్‌వర్క్‌లో చేర్చుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు గుర్తించాయి. జైషే మహమ్మద్ కు అనుబంధంగా పనిచేసే ‘జమాతుల్-ముమినాత్’ అనే సంస్థ ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే చదువుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంది. వాట్సాప్, టెలిగ్రా మ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు మదర్సాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తోంది. మహిళా ఉగ్రవాదుల ఏర్పాటుకు జైషే అధినేత మసూద్ అజర్, అతడి సోదరు తల్హా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మహిళ ఉగ్రమూకల బృందానికి జమాత్ ఉల్ మోమినత్ పేరును ఖరారు చేశారు.
ఈ దళానికి మసూ ద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తోంది. ఈ బృందం లో ఇప్పటికే జైషే ఉగ్రవాదుల భార్యలను చేర్చుకుంది. వీరితో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు శిక్షణనిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో సాదియా భర్త మరణించాడు.
బహావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్, మాన్సేరా ప్రాంతాల్లోని తన కేంద్రాల్లో మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది. అయితే ఆర్థికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న మహిళల బ్రెయిన్ వాష్ చేసే ఉపాన్యాసలిచ్చి, వారిని ఈ ఉగ్ర స్ంథలో చేర్చుకుంటున్నారని తెలుస్తున్నది.