calender_icon.png 16 December, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100శాతం పోలింగ్ నమోదు లక్ష్యం

16-12-2025 12:00:00 AM

అధికారులకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఆదేశం..

ఆదిలాబాద్/చెన్నూర్/కుమ్రంభీం ఆసిఫాబాద్/నిర్మల్/తలమడుగు, డిసెంబర్ 15: మూడవవిడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించా రు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహ త్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామాల్లో వందశాతం పోలింగ్ సాధించేం దుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. ఓటర్ స్లిప్లతో పాటు 18 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని గ్రామాల్లో టామ్టామ్ ద్వారా ప్రచారం నిర్వ హించాలని సూచించారు.

ఓటర్ స్లిప్ల పంపిణీ వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకో వాలని ఎంపీడీఓలు, తహసీల్దార్లను ఆదేశిం చారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ గూగుల్ మీట్లో అదనపు కలె క్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డిపిఓ రమేష్, ఆర్డీఓ స్రవంతి, డిఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైన ర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జోనల్, సెక్టర్, ప్రత్యేక అధికారులుపాల్గొన్నారు.

సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 17వ తేదీన జరగనున్న మూడవ విడత పోలింగ్ నిర్వహణకు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బం ది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నియోజక వర్గంలోని కోటపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మందమర్రి మండల కేం ద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఏర్పా టు చేసిన మూడవ విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఆయా మండలాల ఎంపీడీఓలతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, ఓటింగ్, కౌంటింగ్ కోసం అవసరమైన సామాగ్రి పం పిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. మూడవ విడతలో భాగంగా ఈ నెల 17న జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలలో గ్రామపంచాయతీ సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు.

అధికారులు , సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు నిష్పక్షపాతం గా ఓటు హక్కు వినియోగించాలని కోరారు.

ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డిఓ లోకేశ్వర్ రావు లతో కలిసి 3వ విడత ఎన్నికల నిర్వహణపై ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండ లాల తహసిల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, స్టేజ్ 2 ఆర్.ఓ. లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 3వ విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

3వ విడతలో 104 గ్రామపంచాయతీలు, 744 వార్డు సభ్యులకు ఎన్నికల నిర్వహ ణ ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ వేగవంతంగా జరిగేలా అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా రాండమైజేషన్

నిర్మల్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ర్యాండమైజే షన్ ప్రక్రియ పూర్తి చేశారు. మూడవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు రాండమైజేషన్ మండ లాల వారిగా నిర్వహించారు. ఈ రాండమైజేషన్ ప్రక్రియలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.   అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడినంత మంది ఆర్వో, ఓఆర్వోలను నియమించనున్నారు.

ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అందుబాటులో ఉన్న ట్లు తెలిపారు. మొదటి, రెండు దశలను ఎన్నికలను అధికారుల సమన్వయంతో పకడ్బం దీగా పూర్తి చేశామని, మూడవ దశ  ఎన్నికల ను విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న, జెడ్పి సీఈఓ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ర్యాలీలు నిర్వహించరాదు: ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం మూడ వ విడత ఎన్నికల నేపథ్యంలో  తలమడుగు మండలం సుంకిడి, తలమడుగు, బరంపూర్, కజర్ల, దేవాపూర్ లాంటి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటు హక్కు ను స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటు పై ఉండకూడదని తెలిపారు.

ఎన్నికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయకూడదని, యువత రెచ్చిపోయి ఏలాంటి ఘటనలకు పాల్పడవద్ద ని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొ ట్టే పోస్టులను పెట్టిన వారిపై పోలీసు చర్యలు తప్పమన్నారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.  ఎన్నికలలో సమస్యలు సృష్టించే వారిని బైండవర్ చేయడం జరిగిందని తెలిపారు.  ఈ కార్య క్రమంలో రూరల్ సీఐ ఫణిదర్, ఎస్‌ఐలు రాధిక, జీవన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.