calender_icon.png 28 November, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ట్రోఫీలు నేనే గెలిపించా

27-11-2025 12:00:00 AM

గుహావటి, నవంబర్ 26 : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. గుహావటి టెస్ట్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా మీ భవిష్యత్తు ఏంటి అని విలేఖరులు ప్రశ్నించగా దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇక్కడ వ్యక్తుల కంటే క్రికెట్టే ముఖ్యమన్నాడు.

తాను ముందు నుంచీ ఇదే మాట చెబుతున్నానంటూ గుర్తు చేశాడు.తనను కోచ్‌గా ఉంచాలా..వద్దా అన్న దానిపై బోర్డు డిసైడ్ చేస్తుందన్నాడు. తన నిర్ణయాలతోనే భారత్ ఆటతీరు అధ్వాన్నంగా తయారైందన్న విమర్శలకు గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. తన ఆధ్వర్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ గెలిచామంటూ చెప్పుకొచ్చాడు.