calender_icon.png 20 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు బాధితులకు అండగా ఉంటాం

20-09-2025 01:10:34 AM

  1. షేక్‌పేట ముంపు కష్టాలకు శాశ్వత విముక్తి 

రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ విజయలక్ష్మి 

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి, మేయర్   

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి వర్షాకాలంలో నరకం చూస్తున్న షేక్‌పేట డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపుతామని, ప్రజలు అధైర్యపడవద్దని రాష్ర్ట కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భరోసా ఇచ్చారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు షేక్‌పేట డివిజన్‌లోని విరాట్ నగర్, మినీ బృందావనం, హకీమ్ కాలనీలు తీవ్రంగా ముంపునకు గురైన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మంత్రి వివేక్, మేయర్ విజయలక్ష్మి ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయి లో పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాం తాల్లో నడుములోతు నీటిలో నడుస్తూ, ఇం టింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు.

వారి సమస్యలను తక్షణమే శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్, మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడటం చూస్తుంటే బాధగా ఉంది. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని మేము నిశ్చయించు కున్నాం. ముంపు బాధిత ప్రజలకు ప్రభు త్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ ధైర్యం కోల్పోవద్దు” అని అన్నారు.

అనంతరం, వారు అక్కడే ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ముంపునకు గల కారణాలను అడిగి తెలుసుకుని, శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్, జోనల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.