12-01-2026 12:00:00 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్, జనవరి 11 : భారత మార్కెట్ పై కియా దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉంటుందని ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంగ్వీ , ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాగోల్ సర్కిల్ లో ఆటోమోటివ్ కియా వాహనాన్ని రాజీవ్ సంగ్వీతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఆవిష్కృతమైన బిగర్, బోల్డర్, ప్రోగ్రెసివ్ ఆల్-న్యూ కియా సెల్టోస్ ధర 10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.
కొత్త తరం ఎస్యూవీ కొనుగోలుదారుల కోసం రూపొందించిన ఆల్-న్యూ కియా సెలోస్, డిజైన్, స్పేస్, సేఫ్టీ, టెక్నాలజీ పరంగా మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను కలిగి ఉంటుందన్నారు. తొలిసారిగా ప్రవేశపెట్టిన కియా గ్లోబల్ కె3 ప్లాట్ఫాం- మెరుగైన భద్రత డ్రైవింగ్ లో అధునాతన భద్రత ,ఇంటెలిజెంట్ డ్రైవ్ ఆటోనమస్ ఫీచర్లతో లెవల్ 2, అలాగే బలమైన 24 స్టాండర్డ్ సేఫ్టీ ప్యాక్ కలిగి ఉంటుందన్నారు.
ఆల్-న్యూ కియా సెలోస్ను 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభపు ధర ఉంటుందన్నారు. గ్లోబల్ కే ప్లాట్ ఫార్మ్, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక భద్రతా డిజిటల్ ఫీచర్లతో కూడిన ఆల్-న్యూ సెలోస్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రంగా నర్సింహగుప్తా, చింతల అరుణా సురేందర్ యాదవ్, బీజేపీ నాయకులు, కియా మోటార్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.