12-01-2026 12:00:00 AM
పండుగలు ఏవైనా ‘ప్రత్యేకం’ పేరుతో టీజీ ఆర్టీసీ పైసా వసూల్ చేస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీజీ ఆర్టీసీ బస్సులు నడపకపోగా ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి మహిళలకు ఫ్రీ అంటూనే వారి కి తోడుగా వచ్చిన మగవారు, మగ పిల్లల చార్జీలు దినసరి రేటు కంటే అదనంగా 50% ధరలు పెంచి నిలువునా దోపిడీ చేస్తున్నారు. ప్రయాణికుల సేవి ప్రథమ కర్తవ్యం అంటూ కుప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ ప్రజల ప్రయాణాన్ని ఆసరాగా చేసుకుని ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగకు సొంత ఊర్లకు వెళ్దా మని భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో ఇంటిబాట పట్టిన కుటుంబాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో ఉన్న చార్జీల కంటే అదనపు 50 శాతం చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండుగల వేళ టీజీ ఆర్టీసీ దోపిడీ
ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డు
మండిపడుతున్న ప్రయాణికులు
పండుగలు ఏవైనా
ప్రయాణం నరకమే..
నిర్మల్, జనవరి 11 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో టీజీ ఆర్టీసీ ద్వారా నడపబడుతున్న ఆర్టీసీ బస్సులో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఊర్లకు వెళ్లే రావాలంటేనే ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వం మహిళల కు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లో ఉచిత ప్రయాణానికి మహిళలు అర్హులు కావడంతో ఇప్పటికే అన్ని టీజీ ఆర్టీసీ బస్సులో మహిళలతో కిటకిటలాడుతున్నాయి.
నిర్మల్ బైంసా డిపో పరిధిలో ఉన్న టీజీ ఆర్టీసీ బస్సులో దసరా దీపావళి సంక్రాంతి ఇలా ఏ పండుగ లు అయినా సొంత ఊర్లకు వెళ్లాలంటే ఉన్న చార్జీ కంటే అదనపు చార్జీ చెల్లిస్తేనే సంతులకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడింది నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ ముధోల్, బాసర తదితర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్ నిజామాబాద్, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలు చదివిన విద్యార్థులు సొంత గ్రామానికి వస్తుంటున్నారు.
ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో గురుకులాల్లో సుమారు 3000 మంది విద్యార్థులు నిర్మల్ వాసులు చదువుకుంటారు. హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి తదితర ప్రాంతా ల్లో లక్ష వరకు పిల్లలు ఉంటారు. హైదరాబాదులో సాప్ట్‌వేర్ ఇతర ప్రైవేటు రంగాల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తారు. వీరి పిల్లలకు సెలవులు రావడంతో సొంత ఊరికి వచ్చి వారం రోజులు కుటుంబ సభ్యులు బంధువులతో సొంత ఊర్లో గడిపేందుకు మొగ్గు చూపుతారు. అయితే సొంత ఊర్లకు వెళ్లే వారికి టీజీ ఆర్టీసీ ఆయా రోడ్ల రద్దీనిబట్టి బస్సులు ఏర్పాటు చేయాలి. కానీ ఆర్టీసీ అధికారులు బస్సుల కొరతను చూపించి ప్రత్యేక సర్వీసుల పేరుతో స్పెషల్ బోర్డులు పెట్టుకొని ఆ బస్సులో ఫ్రీ టికెట్ చెల్లుబాటు కాదంటూ ఉన్న ఛార్జి కంటే అదనంగా 50% చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ఏ పండుగ అయి నా పరిపాటుగా మారిపోయింది.
పండుగను సొంత ఊరిలో హాయిగా జరుపుకుందామనుకుంటే ఆర్టీసీ చార్జీల మోత వారిని మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. ప్రైవేట్ బస్సులో భద్రత లేకపోవడం ఆర్టీసీ చార్జీల పెంపు కారణంగా ప్రైవేటు బస్సులు కూడా చార్జీలను పెంచుతూ కెపాసి కంటే ఎక్కువగా ప్రయాణికులను ఎక్కించుకోవలసిన పరిస్థితి నెలకొంది . నిర్మల్ జిల్లాకు బాసర రైల్వే కనెక్టివిటీ ఉన్న ముథోల్, బాసర, తాండూర్, బైంసా ప్రాంత విద్యార్థులు ప్రజలు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటారు. రైళ్లలో రద్దీ పెరిగింది. రిజర్వేషన్ దొరకకపోవడంతో గత్యంతర లేక టీజీ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నట్టు ప్రయాణికులు పేర్కొంటున్నారు
అధిక చార్జీలతో జేబులకు చిల్లి
పండుగల వేల టీజీ ఆర్టీసీ ప్రయాణికుల ను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా రద్దీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది గొడవ పెట్టుకుంటున్నారు. స్పెషల్ బోర్డు పెట్టి దాని పక్కన ఎక్స్‌ప్రెస్ బోర్డ్ ఏర్పాటు చేసి నిర్మల్, బైంసా, ఆదిలాబాద్ డిపోలో చెందిన వందనా లు బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మేడ్చల్, ఘట్‌కేసర్, వరంగల్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు నడిపిస్తున్నారు. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే ఉన్న చార్జీకంటే 50% అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు.
నిర్మల్ నుండి నిజామాబాద్‌కు రూ.110ఉండగా రూ.130 లు, మంచిర్యాలకు రూ.180 ఉండగా రూ. 250, హైదరాబాద్‌కు రూ.380 ఉండగా రూ.450 వరకు చార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు పేర్కొంటున్నారు. నిర్మల్, భైంసాకు రూ.90 చార్జీ ఉండగా రూ.110 వ సూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ అని మహిళలు బస్సు ఎక్కితే టికెట్ టికెట్టు బస్సు అంటూ దింపేస్తున్నారు. ఒకవేళ ఎక్స్‌ప్రెస్ బస్సు నడిపితే మగవారికి అదనంగా చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. అధిక చార్జీలపై ఇప్పటికి స్థానిక బస్టాండ్లో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఆర్టీసీ సిబ్బందిని నిలదీస్తున్న తమ వద్ద ఏమీ లేదని ఆర్టీసీ పెద్దలను అడిగారని ముక్కుసూటిగా సమాధానం చెబుతున్నారు.
బస్సుల కొరత పేరుతో..
టీజీ ఆర్టీసీ ఆదా య వనరులను పెంచుకునేందుకు పండుగ సెంటిమెంట్‌ను వాడుకోవ డంపై పండుగ సం తోషం కంటే ప్రయాణాల చార్జీలే వారిని ఎక్కువగా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీజీ ఆర్టీసీ బస్సులను నడపవలసిన అధికారులు బస్సుల కొరత పేరుతో ఉన్న బస్సులను ప్రత్యేక బస్సులు పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు ఏర్పాటు చేసి దోపిడీ చేయడంపై జిల్లా అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.