04-07-2025 09:58:30 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం అనుమాన స్పద స్థితిలో గొల్లపల్లి శ్రీనాద్ (25) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన గొల్లపల్లి శ్రీనాద్ అనే వ్యక్తి సింగరేణి సివిల్ లో ప్రవేట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం శ్రీనాద్ కడుపు నొప్పితో బాధపడుతుండగా స్థానిక భగత్ సింగ్ నగర్ లోని ఓ ప్రవేట్ క్లినిక్ కి వెళ్లగా ఆర్.ఎం.పి సూది మందు ఇచ్చి చికిత్స అందించాడు.
ఇంటికి వెళ్లిన శ్రీనాద్ గోలి మందు తీసుకోగా కాసేపటికే నోటినుండి నురుసులు రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో శ్రీనాద్ ను తమ కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.అప్పటికే శ్రీనాద్ మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్ధారించారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్.ఎం.పి నిర్లక్ష్యంతోనే శ్రీనాద్ మృతి చెందాడని తండ్రి ఫిర్యాదు చేసినట్లు మందమర్రి సిఐ శశిథరూర్ రెడ్డి తెలిపారు.