calender_icon.png 5 July, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి

04-07-2025 09:51:38 PM

జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి

దౌల్తాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, అహ్మద్ నగర్ పలు పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులకు విచ్చేస్తానే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. 15 సంవత్సరాల యువకులకు, వయోజనులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అభ్యసించే అవకాశం ఉందని గ్రామాల్లోని యువకులకు సమాచారం అందించాలని సూచించారు. 

ప్రతి గ్రామపంచాయతీలో ఉల్లాస ద్వారా అభ్యాసకుల వివరాలు పొందుపరచాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి టీచర్ల బోధన తీరుపై అడిగి తెలుసుకుని విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కనకరాజు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ముత్యంరెడ్డి, ప్రశాంత్, స్వాతి, సౌజన్య సీఆర్పీలు నగేష్, కుమార్, రాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.