calender_icon.png 5 July, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన

04-07-2025 09:55:18 PM

అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ కార్యాలయం వద్ద అర్థనగ్న నిరసన

ఏండ్లపాటు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకొని అధికారులు

అబ్దుల్లాపూర్​మెట్​: తనకు న్యాయం చేయలంటూ ఓ బాధితుడు అబ్దుల్లాపూర్​ మెట్ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. అర్థనగ్నంగా ఆఫీసు ముందు కూర్చొని నిరసన తెలిపాడు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి అధికారులే తమకు అన్యాయం చేశారని ఆరోపించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్​కు చెందిన గంగిరెడ్డి గిరిధర్​రెడ్డి తండ్రి గంగిరెడ్డి శంకర్ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం తట్టిఅన్నారం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 109, 110లో 6 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి సంబంధించిన భూ వివాదం 2000  సంవత్సరం నుంచి కోర్టులో నడుస్తుంది. కాగా 2016లో శంకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత శంకర్ రెడ్డికి ఆ భూమిపై పాసు పుస్తకాలు వచ్చాయి.

కాగా తిరిగి ఈ వివాదం కోర్టుకు వెళ్ళింది కోర్టులో వివాదం నడుస్తుండగానే 2022లో శంకర్ రెడ్డికి చెందిన 6 ఎకరాల భూమిని ఆమోద డెవలాఫర్స్ అనే సంస్థకు తమకు తెలియకుండానే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్​తో పాటు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్​ కలిసి కోర్టు స్టేటస్కో ఉన్నప్పటికీ పాసుపుస్తకాలు  మంజూరు చేసి ధరణిలో రికార్డులు మార్చారని ఆరోపించాడు. మా పేరుపై ఉన్న భూమిని మాకే తెలియకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ సంస్థ పేరుపై ఎలా రిజిస్ట్రేషన్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయంలో గతంలో ఉన్న తహసీల్దార్లుగా పనిచేసిన అనిత రెడ్డి, రవీందర్ దత్​లపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దాఖలు చేశామని  బాధితుడు తెలిపాడు. ఇదే విషయంలో 2023 ఆగస్టులో అప్పటి జిల్లా కలెక్టర్ మా పేరుపై భూమి చేసే విధంగా ఆర్డర్ కూడా ఇచ్చాడని తెలిపాడు.

కానీ కింది స్థాయి అధికారులు ఆ ఆర్డర్​ను ముందుకు సాగనివ్వలేదని చెప్పాడు. ఇది ఇలా ఉండగా తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిధర్ అనే వ్యక్తి ఆందోళనకి దిగాడు అని సిబ్బంది ద్వారా తెలుసుకున్న ప్రస్తుత  తహసీల్దార్​ సుదర్శన్​రెడ్డి ఆఫీస్ కు చేరుకొని బాధితుడితో మాట్లాడాడు. గతంలో ఉన్న అధికారులు ఏవిధంగా ఇతరులకి రిజిస్ట్రేషన్ చేసారో నాకు తెలియదని.. ఈ భూమిపై కోర్ట్ స్టేటస్కో ఉన్నందున మేము చట్ట ప్రకారం వెళ్తున్నాము. రిజిస్ట్రేషన్ చేయలేమని బాధితుడికి  చెప్పటం జరిగిందన్నారు. గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేసి ఇరు వర్గాలని పిలిపించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏదైనా కోర్టులో తేల్చుకొమ్మని గిరిధర్ రెడ్డికి చెప్పినట్లు  తహసీల్దార్​ సుదర్శన్​రెడ్డి తెలిపాడు.