calender_icon.png 7 November, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగులోని గుట్టల్లో భారత స్కౌట్స్ ఆండ్ గైడ్స్ జెండా ఆవిష్కరణ

07-11-2025 06:05:07 PM

,(విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు వారి సేవలను అందించారు. అయితే శుక్రవారం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా జాతర ప్రాంగణంలోని స్థంభం చెట్టు దగ్గర భారత్ స్కౌట్స్ ఆండ్ గైడ్స్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి డిప్యూటీ పర్సనల్ మేనేజర్ కే. క్రాంతి కుమార్ హాజరు కాగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ పి.శ్రావణ్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. వారితో ఉన్న సిబ్బంది జెండాకు సెల్యూట్ చేస్తే స్కౌట్స్ ఆండ్ గైడ్స్ గీతాన్ని ఆలాపన చేశారు.