calender_icon.png 7 November, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి

07-11-2025 06:01:02 PM

ఇంద్రవెల్లి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోని, చదువునే ఆయుధంగా చేసుకొని కలలను సాకారం చేసుకోవాలని హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంబ్లే అతీశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల-1 లో అంబేద్కర్ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్ప్ వీల్ ఫౌండేషన్ తరుపున విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి సారిగా పాఠశాలలో చేరినందుకు నవంబర్ 7న విద్యార్థి దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు.

సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమనీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం జాదవ్ గోవింద్, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ సందీప్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ఉపాధ్యక్షుడు సావంత్ రాజవర్ధన్, దళిత సంఘాల నాయకులు వాగ్మారే శుధ్ధోధన్, పరత్వాగ్ దత్త, హెల్ప్ వీల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.