07-05-2025 04:19:26 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్(MPDO Mahender), ఆర్డీవో హరికృష్ణ వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీలలో గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు సెలెక్ట్ చేయవలసి ఉండగా ఆయా గ్రామాలలో కొందరు నాయకులు తమ ఇష్టారాజ్యంగా తమ అనుచరులకు అర్హత లేని వారికి పక్కా ఇండ్లు ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపిస్తున్నారని ఆరోపించారు.
బెల్లంపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీలలోని ఆయా కార్యాలయాల్లో నోటీసు బోర్డుపై మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను అంటించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఎంపికలో పారదర్శకత, నిబంధనలు లోపించాయని అధికారులకు వినతిపత్రం ఇచ్చిన వారిలో భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, మంచిర్యాల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మేకల రాజేశం, బెల్లంపల్లి మండల సిపిఐ సహాయ కార్యదర్శి గోమాస గంగారం ఉన్నారు.