16-08-2025 10:42:39 PM
నాగారం: మండలంలోని వివిధ గ్రామాల్లో కష్ణాష్టమి వేడుకలను ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా నాగారం, నాగారంబంగ్లా, పసునూర్, పస్తాల, డి.కొత్తపల్లి, ఫణిగిరి, వర్థమానుకోట, ఈటూరు తదితర గ్రామాల్లో చిన్నారులు శ్రీకష్ణుడి, గోపికల వేశధారణలు ధరించి పలువురిని ఆకట్టుకున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో సాయంత్రం వేళా ఊట్టుకొట్టే కార్యక్రమాలను నిర్వహించారు.