17-11-2025 05:14:36 PM
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన విప్..
కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని నేడు గృహ ప్రవేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నేడు స్వంత ఇంటి కల సాకారం అయ్యిందని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తాసిల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గొట్టే రుక్మిణి, వెంకన్న, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.