calender_icon.png 17 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పూర్తి చేయుటకు నిధులు విడుదల చేయండి

17-11-2025 06:58:52 PM

మంత్రి పొన్నంకు కోరిన జిల్లా ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్..

కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలోని తిమ్మాపూర్ రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పూర్తి, మరమ్మత్తు కోసం నిధుల విడుదల చేయాలని జిల్లా రవాణా సంస్థ సభ్యుడు పడాల రాహుల్ కోరారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. తిమ్మాపూర్ లోని జిల్లా రవాణా కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన శాస్త్రీయ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిధుల కొరత కారణంగా నిరుపయోగంగా ఉందని, ట్రాక్ ను క్రియాత్మకంగా మార్చడానికి, డ్రైవర్లకు డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించడానికి, కొన్ని మరమ్మతులు, పనులు అవసరం ఉన్నాయని తెలిపారు.

జిల్లా ఆర్ అండ్ బి అధికారి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ మరమ్మత్తు కోసం ఇచ్చిన సూచనల మేరకు దెబ్బతిన్న కర్బ్లను సరిగ్గా పరిశీలించి, గతంలో ట్రాక్ ను డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించడానికి యోగ్యమైనదిగా మార్చారని, కానీ ప్రస్తుతం ఆ ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ట్రాక్ మరమ్మతుల కోసం, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పనులను చేపట్టడానికి అదనంగా 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని పడాల రాహుల్ మంత్రిని కోరారు.