calender_icon.png 17 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి దశలోనే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

17-11-2025 07:11:23 PM

గజ్వేల్: విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరు వివిధ అంశాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ట్రాఫిక్ సిఐ మురళి అన్నారు. గజ్వేల్ లోని జిజ్ఞాస హైస్కూల్‌లో బుధవారం సబ్జెక్ట్ ఎక్స్పోను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు తయారు చేయడం వల్ల ఆయా అంశాలపై అవగాహన పెరగడంతో పాటు అంతర్గత ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు.

మొబైల్ ఫోన్ వినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గుతున్నందున వాటికి దూరంగా ఉండాలన్నారు. పోటీ ప్రపంచంలో విద్య పట్ల ఆసక్తి, నైపుణ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్‌కు ఇలాంటి ఎక్స్పోలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కరుణాకర్, సెయింట్ మేరీస్ విద్యాన్ హైస్కూల్ ప్రజ్ఞాపూర్ కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి, మాజీ కౌన్సిలర్ మెట్టయ్య, ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు పాల్గొన్నారు.