calender_icon.png 17 November, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత ఏటి రామస్వామి కన్నుమూత

17-11-2025 07:20:20 PM

సంతాపం తెలిపిన ఎమ్మార్పీఎస్ నేత గుర్రాల శ్రీనివాస్ 

సిద్దిపేట: మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఎమ్మార్పీఎస్) తొలి తరం నాయకుల్లో ప్రముఖులు, రిటైర్డు వార్డెన్ ఏటి రామస్వామి సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణ వార్తతో మాదిగ ఉద్యమ కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రామస్వామి మృతి పట్ల ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ సంతాపం తెలిపారు. రామస్వామి గపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు నాయకులు ఘనమైన అశ్రు నివాళులు అర్పించారు. అయన అంతిమ యాత్ర మంగళవారం పాలకులలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.