17-11-2025 07:16:49 PM
* మద్దిమడుగు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష
* విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు
అచ్చంపేట: నల్లమలలో వెలసిన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించాలని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 4 వరకు పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలయ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానంగా తాగునీటి ఇబ్బంది, విద్యత్, పారిశుద్ధ్య నిర్వాహణ పకడ్బంధీగా ఉండాలని ఆదేశించారు. ఉత్సవాలు ప్రారంభానికి ముందే అవసరమైన వసతులు క్పలించాలన్నారు. ఆలయం ఆవరణలో త్వరలోనే సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రాములునాయక్, పాలక మండలి సభ్యులు, పురపాలిక ఛైర్మన్ శ్రీనివాసులు, ఈవో రంగాచారీ, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ హేమలత, ఆర్అండ్ బీ డీఈ జలందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.