calender_icon.png 17 November, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండోర్ స్టేడియం కోసం స్థల పరిశీలన

17-11-2025 05:20:05 PM

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియం కోసం కాంగ్రెస్ నాయకులు అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు మండల కేంద్రంలో అధికారులు కాంగ్రెస్ నాయకులు స్థల పరిశీలన చేశారు. ఇండోర్ స్టేడియం కోసం అనుకూలంగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణరెడ్డి, పంచాయతీ రాజ్ డి ఈ విష్ణువర్ధన్ విష్ణువర్ధన్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఆర్ఐ మనోజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, మాజీ ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్, మాజీ సర్పంచ్ కన్నం మధు తదితరులున్నారు.