17-11-2025 05:04:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): క్రీడల్లో నిర్మల్ పేరును నిలబెట్టేలా క్రీడాకారులు ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అండర్ 17 బాల బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ ఇష్టమైన క్రికెట్ ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, క్రికెట్ క్రీడలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో ఎంపికై రాబోయే రోజుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అదేవిధంగా జాతీయస్థాయికి ఎంపిక జిల్లా పేరును నిలపాలని క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ రవీందర్ గౌడ్, కన్వీనర్ రాజు నాయక్, TGPETA ప్రధాన కార్యదర్శి వన్నెల భూమన్న, TSPETA అధ్యక్షులు అంబాజీ, ప్రధాన కార్యదర్శి డేవిడ్ బెన్హర్, TRTF అధ్యక్షులు దర్శనం దేవేందర్, TGPRTU నిర్మల్ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, TSUTF సెక్రటరీ పెంట అశోక్, నిర్మల్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు రమణ రావు, ఎం శ్రీనివాస్, శ్రీనివాస్, నచ్చేందర్, మారుతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.