calender_icon.png 17 November, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు లబ్ధిదారులకు ఉపకరణాల అందజేత

17-11-2025 07:05:39 PM

ప్ర‌జావాణిలో స్పందించిన మెద‌క్ కలెక్టర్ రాహుల్ రాజ్‌..

సంగారెడ్డి (విజ‌య‌క్రాంతి): మెద‌క్ క‌లెక్ట‌రేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాల మేరకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి వెంటనే చర్యలు చేపట్టి ముగ్గురు లబ్ధిదారులకు అవసరమైన ఉపకరణాలను అందజేశారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలను దీర్ఘకాలం వేచి చూడకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పని చేస్తుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి అభ్యర్థనను కేసు వారీగా పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి, అవసరానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం, అత్యంత ప్రాధాన్యతగా ఉన్నదని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి తెలిపారు.

ఇదిలా ఉండగ, నశాముక్త భారత్ అభియాన్ జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. దానిలో భాగంగా ఈనెల 18న‌ సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సే నో డ్ర‌గ్స్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేలా మార్గనిర్దేశం చేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం జిల్లా పరిపాలన తీసుకుంటున్న చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు.