17-11-2025 07:13:02 PM
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని చిర్రకుంట ఎక్స్‌రోడ్ నుండి అంకుశాపూర్ మెడికల్ కళాశాల వరకు వీధి దీపాల లేమితో ప్రజలు, విద్యార్థులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మెడికల్ కాలేజీతో పాటు పరిసర గ్రామాల ప్రజలు రాత్రి సమయంలో ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మా దృష్టికి వచ్చింది.
వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించి దాతల సహకారంతో వీధి దీపాలు అమర్చించి లైట్లను వెలిగించమని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా కృషి చేస్తున్న సీఐ బాలాజీ వరప్రసాద్‌ను మెడికల్ కళాశాల విద్యార్థులు, స్థానిక గ్రామాల ప్రజలు అభినందించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయండి. సమస్య పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని సీఐ తెలిపారు.