16-08-2025 12:48:52 AM
సంక్షేమ పథకాల అమలులో టాప్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్, ఆగస్ట్15(విజయక్రాంతి): ఇం దిరమ్మ ఇండ్లు :జిల్లాలో ఇంటి స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికే 5 వేల 672 ఇండ్ల ని ర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరు గుతున్నాయని.
గృహ నిర్మాణాన్ని బట్టి దశ ల వారీగా లబ్దిదారులకు 32 కోట్ల 30 లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింద ని రాష్ట్ర ఐ టి, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ పరేడు మైదానంలో జా తీయ పతాకాన్ని అవిష్కరించారు.
ఈ సంద ర్బంగా కరీంనగర్ జిల్లాలోఅమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో 5 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో “సెంటర్ ఆఫ్ ముర్రెల్ ఎక్సలెన్స్” స్థాపించేందుకు తొలి విడతగా కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది.