calender_icon.png 16 August, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

16-08-2025 12:49:09 AM

జాతీయ జెండాను ఆవిష్కరించిన సీపీ అవినాష్ మహంతి

శేరిలింగంపల్లి, ఆగస్ట్ 15:సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ముందుగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి  స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది,ప్రజలందరికీ ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరూ దేశ సేవకు పునరంకితం కావాలన్నారు.

స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేసి మెరుగైన సమాజం దిశగా అడుగు వేయాలన్నారు.ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జడ్.

సీపీ (ట్రాఫిక్) డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్, ఎల్&ఓ డీసీపీలు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ జి, ఐపీఎస్, మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి, ఐపీఎస్, బాలంగనగర్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఐపీఎస్, డీసీపీ రాజేంద్రనగర్ సీహెచ్ శ్రీనివాస్, ఐపీఎస్, శంషాబాద్ డీసీపీ బి. రాజేష్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, ఎస్బీ డీసీపీ సాయి శ్రీ, డబ్ల్యూ అండ్ సీఎస్డబ్ల్యూ డీసీపీ సృజన కర్ణం, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మాదాపూర్ ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సైబరాబాద్ సీఏఆర్ హ్యుమానిటీస్ డీసీపీ సంజీవ్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, రోడ్ సేఫ్టీ డీసీపీ ఎల్.సి. నాయక్, ఏడీసీపీ (అడ్మిన్) రవిచందన్ రెడ్డి, సీఏఆర్ ప్రధాన కార్యాలయాలు ఏడీసీపీ షమీర్, సీఎస్డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్ రావు, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సెక్షన్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.