calender_icon.png 20 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ జరగాలి

20-11-2025 12:33:56 AM

ఇందిరమ్మ చీరల పంపిణీ పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:19 ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జిల్లా కలెక్టర్లకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ను ,అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయంలో మహిళా సమైక్య సభ్యు లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ కె.హైమావతి, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ముఖ్యమంత్రికి వివరించారు. తరువాత సమాఖ్య ప్రతినిధులతో మాట్లాడిన కలెక్టర్ ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అర్హులయిన ప్రతి మహిళకు చీర పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నామని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్కి స్థానిక ఆర్డీఓలు, దుబ్బాక నియోజక వర్గానికి సీనియర్ అధికారిని నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో 18 సం వత్సరాలు నిండిన మహిళల వివరాలు ఖచ్చితంగా సేకరించాలని,ప్రజా ప్రతినిధుల సమక్షంలో నిర్ణీత గడువులో పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మహిళల ఆర్థిక,సామాజిక ఎదుగుదల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది అని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ వినోద్ కుమార్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు టి.రేణుక, మున్సిపల్ కమిషనర్లు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.