22-05-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 21 (విజ యక్రాంతి): బ్యాంకర్లు తమకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, నాబార్డ్ మేనేజర్ వీరభద్రుడు లతో కలిసి బ్యాంకర్లు, అధికారులతో నిర్వహించిన 4వ వార్షిక జిల్లాస్థాయి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు తమకు నిర్దేశించిన ప్రకారం వార్షిక రుణ లక్ష్యాలను సాధించాలని అన్నారు. వెనుకబడిన జిల్లాలో భాగం గా ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పొదుపు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీ ణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లు, బ్యాంకుల మేనేజర్లు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సజీవన్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సం క్షేమ అధికారి నదీమ్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.