calender_icon.png 14 May, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

14-05-2025 12:00:00 AM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ. అనుబంధ సంఘం. మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మే 20వ తేదీన విజయవంతం చేయాలని అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోస్టర్లు మంగళవారం ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్ మాట్లాడుతూ. నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, ఈ 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అన్ని కార్మిక సం ఘాలు పిలుపునిచ్చాయి.

కార్యక్రమంలో మె డికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట నాయకులు, ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు దశరథ్. ఏఐటీయూ సీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్ కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా కోశాధికారి రఫీ, కామారెడ్డి ప్రభుత్వ పట్టణ అధ్యక్షులు సందీప్, ఆసుపత్రి కార్మికులు, ఖైరత్ అలీ, భాస్కర్, రజిత, లక్ష్మి, జమున, నాగమణి, వాసవి సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.

సమ్మెను విజయవంతం చేయాలి

సీఐటీయూ నాయకులు సురేష్ 

జుక్కల్: ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ అన్నారు. మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు జిపి కార్మిక కార్మికులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశబ్ద కాలంగా కార్మికవర్గం అనేక ప్రాణ త్యాగాలు, పోరాటలతో సాధించుకున్న  29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలు గు లేబర్ కోడ్‌లు తీసుకువచ్చి వాటి అమలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు.

దేశంలోని పరిస్థితిని వాటిని సమీక్ష చేసిన కేంద్ర, రాష్ర్ట కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు బిజేపి ప్రభుత్వ ప్రజల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాష్ర్ట కమిటీ పిలుపునిచ్చిందన్నారు.

కార్యక్రమంలో జుక్కల్ మం డల అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి అషుఖాన్, జుక్కల్ టౌన్ అధ్యక్షులు విరయ్య, కార్యదర్శి మధు, వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు సంజు, మారుతీ, పండరి, దౌలజీ, రాములు పాల్గొన్నారు.