calender_icon.png 13 December, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి బస్తీ ప్రజలకు మౌలిక వసతులు

11-12-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్ర నగర్ డిసెంబర్ 10 (విజయక్రాంతి) : ప్రతి బస్తీలో ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ తెలిపారు. బుధవారం మైలర్ దేవ్ పల్లి డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పద్మశాలిపురం స్మశాన వాటిక వరకు రూ. 50 లక్షలతో నిర్మించే సీవరేజ్ అండ్ డ్రైనేజీ పనులకు మైలార్దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఎం డబ్ల్యూ ఎస్.అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదు పాయాల కల్పనే ద్యేయంగా అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికే మంచినీటి, డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎంతో కాలంగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడేవారని, ఈ సీవరేజ్ అండ్ డ్రైనేజీ పైపులైన్ల ఏర్పాటుతో శాశ్వత పరిష్కారం లభిస్తుం దన్నారు.

తను నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.  చాలా రోజులుగా దీర్ఘకాలిక సమస్య ను శాశ్వత పరిష్కారం కల్పించబోతున్నందుకు స్థానికులు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తూన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.